LIVE: చింతలపూడి బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - Sharmila Nyaya Yatra Public Meeting - SHARMILA NYAYA YATRA PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 5:44 PM IST
|Updated : Apr 26, 2024, 6:13 PM IST
Sharmila Nyaya Yatra Public Meeting Live: జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మరచిపోయారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ సీఎంకు తెలియదా అంటూ నిలదీశారు. ఐదేళ్లు అయ్యిందని, ప్రత్యేక హోదా ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించట్లేదని షర్మిల విమర్శించారు. మూడు రాజధానులన్నారని, ఒక్కటీ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. అనంతరం ఏలూరు జిల్లా చింతలపూడి బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 26, 2024, 6:13 PM IST