LIVE :సెకి ఒప్పందంపై ఏసీబీ అధికారులకు షర్మిల ఫిర్యాదు ప్రత్యక్ష ప్రసారం - SHARMILA COMPLAINT TO ACB
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2024, 12:23 PM IST
|Updated : Dec 5, 2024, 12:37 PM IST
YS Sharmila Complaint to ACB Officials About SECI Deal LIVE : సెకి ఒప్పందంలో జగన్ అవినీతిపై అన్ని ఆధారాలూ దగ్గర పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ పోర్టునే కాదు కృష్ణపట్నం పోర్టునూ బలవంతంగా రాయించుకున్నారన్నారు. గంగవరం పోర్టును పూర్తిగా అమ్మేశారని ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. సెకితో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్తు నియంత్రణ సంస్థకు లేఖ రాస్తున్నామన్నారు. సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు నేడు ఫిర్యాదు చేస్తామని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు నిరుత్సాహంతో ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శివాజీ, విజయవాడ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఏసీబీ అధికారుల ఫిర్యాదు అనంతరం మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 5, 2024, 12:37 PM IST