ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవీ ఉత్సవాలు- ఆలయ అలంకరణకు 25టన్నుల కూరగాయలు - VIJAYAWADA KANAKA DURGA TEMPLE - VIJAYAWADA KANAKA DURGA TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 4:38 PM IST

Shakambari Devi Festival has started in Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు నిర్వహించే శాకాంబరీ దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు భక్తులకు శాకాంబరీ దేవీ రూపంలో దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయాన్ని కూరగాయలతో అలంకరించారు. రాజగోపురం వద్ద నవదుర్గలను కూరగాయలతో అలంకరించారు. మొత్తం 25 టన్నులకుపైగా వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు కూరగాయలను వితరణగా సమర్పించారు. 

శాకాంబరీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తగిన సంపద ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. భూమిపై సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కొనసాగుతుండటంతో ఘాట్‌ రోడ్డుపై రాకపోకలను అధికారులు పూర్తిగా నియంత్రించారు. సొంత వాహనాలను కొండపైకి అనుమతించకుండా కేవలం దేవస్థానం వాహనాల ద్వారా భక్తులను కొండపైకి తీసుకొస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.