గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం- సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం - Road accident in Mylavaram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 12:30 PM IST
Several People Died in Road Accident in Guntur: శుభకార్యం నుంచి సంతోషంగా ఇంటికి వెళ్లుతున్నముగ్గురిని విధి రోడ్డు ప్రమాద రూపంలో కాటేసింది. గుంటూరు నగరంలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు గార్లపాటి సుబ్బమ్మ (45), గార్లపాటి పావని (18), గార్లపాటి శ్యామ్ దీక్షిత్ (6)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన గార్లపాటి నాగలక్ష్మి, డ్రైవర్ శ్రీకాంత్‌కు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. రాధా అనే మహిళ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతులు, బాధితులంతా కూడా మంగళగిరికి చెందిన వారే. పిడుగురాళ్లలో వివాహానికి హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ఏటుకూరు బైపాస్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి ప్రత్తిపాడు పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Road Accident in NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్ఎస్పీ కాలనీ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ప్రమాదం చండ్రగూడెంకు చెందిన రమేష్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.