నా తనిఖీలను సోషల్ మీడియాలో వక్రీకరించారు - కావాలని ఎవర్నీ అవమానించలేదు : ప్రవీణ్ ప్రకాష్ - Praveen Prakash on Education Dept - PRAVEEN PRAKASH ON EDUCATION DEPT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/640-480-21759567-thumbnail-16x9-senior--ias-praveen-prakash.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 10:09 AM IST
IAS Praveen Prakash on Education Department : పాఠశాల్లో తాను నిర్వహించిన తనిఖీల వల్ల ఎవరైనా అసౌకర్యానికి గురైతే విచారం వ్యక్తం చేస్తునట్లు సీనియర్ ఐఏఎస్, ఏపీ విద్యాశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తన సోదాలను కొంత మంది సామాజిక మాధ్యమాల్లో వక్రీకరించి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం ఏంటో ఆ దేవుడికే తెలుసన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు పెరగాలని, విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే ఆలోచనతోనే తప్ప మరొక ఉద్దేశం లేదని ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యానించారు.
గత సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 పాఠశాల్లో తనిఖీలు చేశానని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. తాను సోదాలు చేసిన ఆ పాఠశాల ఉపాధ్యాయులను అడిగితే వారికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వారే చెబుతారని వివరించారు. ఒక శాఖ వృద్ధిలోకి రావాలంటే ఉద్యోగలు కృషే ప్రధానంగా ఉంటుందన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాలంలో తనకు సహకరించిన టీచర్లు, సిబ్బందికి ప్రవీణ్ ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు.