ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ - నోడల్ అధికారులకు సాంకేతిక శిక్షణ - నోడల్ అధికారులకు సాంకేతిక శిక్షణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 10:37 PM IST
SEC Training for Nodal Officers: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సాంకేతిక శిక్షణను అందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో (EVM) తలెత్తే సమస్యల్లో స్వల్పకాలిక మరమ్మతులపై నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఎస్ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ సీఈవో హరేంధిర ప్రసాద్, ఈసీఐఎల్ సాంకేతిక విభాగ ఉన్నాతాధికారులు పాల్గొని శిక్షణ అందించారు.
రాష్ట్రంలోని నోడల్ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్చువల్ పద్ధతిలో బీహార్, గోవా, లద్దాఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీఘడ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా ఈ శిక్షణను నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొదటి స్థాయి తనిఖీతో పాటు ఈవీఎం యంత్రాల రాండమైజేషన్, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో నిర్వహించాల్సిన విధానంపై అధికారులందరికీ ఈసీఐఎల్ శిక్షణ అందించింది.