మండుటెండల్లో అన్నదాత అవస్థలు- పత్రాల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు - Farmers Protest For 1B Adangal - FARMERS PROTEST FOR 1B ADANGAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 4:40 PM IST

Satya Sai district Farmers Protest For 1-B Adangal : శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువులో 1-బి అడంగల్ ఇవ్వకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా తాళాలు వేస్తున్నారని మండిపడ్డారు. సమస్యపై అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
అధికారులు నిర్లక్ష్యం వల్ల పంట రుణాలను సకాలంలో మేము చెల్లించలేకపోతున్నామని 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కనికరించే నాధుడే కరువయ్యారని  ప్రజలు వాపోతున్నారు. సకాలంలో వన్ వీల్1-బి అడంగల్ సమర్పించకపోతే బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారని  ఇది కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని రైతు సంఘం నాయకులు తెలిపారు. రైతులు మాట్లాడుతూ రోజుల తరబడి తిరుగుతున్నా, ఎండకు వడదెబ్బ తగిలినా, రెన్యూవల్ చేసుకుందామని వస్తే అధికారులు ఎవరూ పట్టించుకోలేదని జిల్లా కలెక్టర్  స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.