నిధులు లేక గ్రామాల్లో కనిపించని అభివృద్ధి - పట్టణాలకు పల్లెజనం వలస: వైవీబీ రాజేంద్రప్రసాద్ - Sarpanch Fire on CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 9:38 PM IST
Sarpanch Protest in Kurnool District : కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పంచాయితీ నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి దారి మళ్లించారని సర్పంచ్‌లు గత కొంత కాలంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. పంచాయితీ నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోచుకుని సొంత అవసరాలకు వాడుకోవడంతో పల్లెల్లో అభివృద్ధి కరువైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన సుమారు 50 వేల కోట్ల రూపాయిలు నిధులు పంచాయితీ ఖాతాల నుంచి జగన్ దొంగలించారని పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. పంచాయతీలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు.
YSRCP Government Diverted Sarpanch Funds : కర్నూలు కలెక్టరేట్ వద్ద సర్పంచ్‌లు వినూత్న నిరసన చేపట్టారు. దారి మళ్లించిన సర్పంచ్ నిధులను విడుదల చేయాలంటూ మెడకు ఉరితాడు వేసుకుని ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాడుకున్న గ్రామ పంచాయతీల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వక్తం చేశారు. దీంతో సర్పంచ్‌ల వద్ద నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు. గ్రామాల్లో ఉండే ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.