NDA Leaders Fires on YS Jagan: ప్రతిపక్షంగా గుర్తించండని సభలో ప్లకార్డులు ప్రదర్శించటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ ఆరోపించారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని ఆయన ఆక్షేపించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన, గతంలో ఎప్పుడూ ఈ తరహాలో రాజకీయ పార్టీలేవీ ప్రవర్తించలేదని కూన వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో 44 సీట్లు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంటుకు హాజరై ప్రజా సమస్యలపై చర్చలు చేశారని అన్నారు. గవర్నర్ను ఎలా గౌరవించుకోవాలో తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తించారని ఆక్షేపించారు. ప్రజలు ఇచ్చిన సీట్లను కూడా గౌరవించకుండా ప్రజా సమస్యల్ని చర్చించకుండా కేవలం తన ప్రతిపక్ష హోదా కోసమే పోరాటం చేస్తున్నారని కూన రవికుమార్ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ తీరు సరికాదు - నియంత్రించకుండా కూర్చుని నవ్వుకుంటారా?: స్పీకర్ అయ్యన్న