Young Man Attacked Married Woman with Knife: 'నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ భర్తను వదిలి నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే మీ ఇద్దరినీ చంపేస్తా' అంటూ ఓ యువకుడు వివాహితను బెదిరించి కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భీమవరం రైల్వే గేటు ప్రాంతంలో వివాహిత నివాసం ఉంటోంది. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. భర్త ఆగిరిపల్లిలో పని చేస్తుండగా ఆమె పట్టణంలో బ్యుటీషియన్‌గా పని చేస్తున్నారు.
2020లో పట్టణానికి చెందిన కె. జగదీష్ అనే యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. కొంత కాలంగా ఆమె జగదీష్ ఫోన్‌ను బ్లాకులో పెట్టింది. నాలుగు రోజుల కిందట జగదీష్ ఆ మహిళకు 206 సార్లు ఫోన్ చేస్తే ఆమె తీయలేదు. ఇంక జగదీష్ వేధింపులు తట్టుకోలేని ఆమె, జగదీష్ వేధిస్తున్నారని పెద్దలకు చెప్పి వారితో హెచ్చరించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె పని చేసే సెలూన్ వద్దకు జగదీష్ వచ్చి బయట వేచి ఉన్నాడు.
రాత్రి 10 గంటల సమయంలో జగదీష్ సెలూన్ లోపలకు వెళ్లి ఒక్కసారిగా తాను వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కొందరు యువకులు అడ్డుపడగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళకు పొట్టలో స్వల్ప గాయమైంది. వెంటనే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెలూన్ సిబ్బంది లేకుంటే ఆమె కత్తిపోట్లకు గురై ఉండేదని స్థానికులు అంటున్నారు. అనంతరం ఆమె కోసం ఆసుపత్రికి వచ్చిన జగదీష్‌ను గుడివాడ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి - ముగ్గురు మృతి
'ముళ్ల కర్రలతో చితకబాదారు' - వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్