పేరుకుపోతున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు- పట్టించుకోని మున్సిపల్ అధికారులు - Sanitation Workers Problems - SANITATION WORKERS PROBLEMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 10:56 AM IST
Sanitation Workers Problems in YSR District: వైఎస్సార్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. పారిశుద్ధ్య వాహనాలు నిర్వహణ లేక మూలకుపడి ఉన్నాయి. వాహనాలు మరమ్మతులకు నోచుకోపోవడంలేదు. వాహనాలు తక్కువగా ఉండడంతో చెత్తను తరలించడం కష్టతరంగా మారిందని కార్మికులు వాపోయారు. విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వాహనాలతో చెత్తను తరలించాలంటే కష్టంగా ఉందని అంటున్నారు. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు.
విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాత్రి వేళల్లో తాగుబోతులతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని మహిళా పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. సమ్మె కాలంలో వేతనాలు ఇవ్వమని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా బద్వేలు పురపాలకులు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికైనా బద్వేలు పురపాలక సంఘంలో అధికారులు మూలకు చేరిన వాహనాలను మరమ్మత్తులు చేయించి దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.