హుస్సేన్‌సాగర్‌లో ప్రారంభమైన పారిశుద్ధ్య పనుల ప్రక్రియ - Ganesha immersions in Tankbund - GANESHA IMMERSIONS IN TANKBUND
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 4:34 PM IST
Cleaning Process in Tankbund: గణేశ్ నిమజ్జనాలు జరుగుతుంటే హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతం జనసంద్రోహంతో ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, నిమజ్జనం తర్వాత అంతే దారుణంగా తయారవుతుంది. సంజీవయ్య పార్క్ పక్కన హుస్సేన్‌సాగర్‌లో, నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. పూలు, సామగ్రి, వస్త్రాలు, కాగితాలు, ఇతర చెత్తా చెదారం సైతం సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రతిరోజు ఐదారు ట్రక్కుల వ్యర్థాలను తరలిస్తున్నామని హెచ్‌ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఒక పక్క వినాయకుల నిమజ్జనం కొనసాగుతుండగా మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో క్లినింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్‌లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ), రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) తీసుకుని పనులను మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే వినాయకుల విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మట్టితో తయారుచేసిన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తీర్పునిచ్చింది.