ఏసీబీ వలలో అవనిగడ్డ శానిటరీ ఇన్​స్పెక్టర్​ - లైసెన్స్​ మంజూరుకు రూ.8000 డిమాండ్​ - Krishna District

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:34 PM IST

Sanitary Inspector CaughtBy ACB While Taking Bribe in Krishna District : కృష్ణాజిల్లా అవనిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శానిటరీ ఇన్​స్పెక్టర్​​గా పనిచేస్తున్న పవర్​ కుమార్​ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులు చిక్కారు. అవనిగడ్డలో రోడ్డు పక్కన టిఫిన్​ సెంటర్​ పెట్టుకోవడానికి లైసెన్స్ కోసం ఆకుల సాయికృష్ణ గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకుమన్నాడు. అందుకు లైసెన్స్​ జారీ చేయడానికి శానిటరీ ఇన్​స్పెక్టర్​​గా విధులు నిర్వర్తిస్తున్న పవర్​ కుమార్​ రూ. 8000 డిమాండ్​ చేశారు.

అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆకుల సాయికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనలు ప్రకారం గురువారం రూ.8000 లంచం ఇవ్వడానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. సాయికృష్ణ లంచం ఇస్తూ ఉండగా అనిశా అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. పవన్​ కుమార్​ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ ఎస్సై స్నేహిత పేర్కొన్నారు. ఏ అధికారైనా లంచం డిమాండ్​ చేస్తే 1400 నంబరు ఫోన్​ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.