'అయినా ఆగడం లేదు' రెచ్చిపోతున్న ఇసుక మాఫియా- మర్రిపాడులో నాలుగు లారీలు సీజ్ - Sand Mafia in Andhra Pradesh - SAND MAFIA IN ANDHRA PRADESH

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 12:02 PM IST

Sand Mafia in Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలేనికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. నది నుంచి అక్రమంగా ఇసుకను ఉద్ధండరాయుని పాలెం సమీపంలో నిల్వ చేశారు. అక్కడ్నుంచి ఎవరూ తిరుగని సమయంలో ఇసుకను లారీలలో తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు ఇసుక రవాణాను అడ్డుకునే బాధ్యత మైనింగ్ శాఖది అని తప్పించుకుంటున్నారు. 

Mining Officer Sizes 4 Sand Lorry in Nellore district : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని ఇసుక డంపింగ్ యార్డ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను తెలుగుదేశం నేతలు అడ్డుకున్నారు. ఇసుక లారీలను అడ్డుకొని మైనింగ్ అధికారులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇసుకను తరలిస్తున్న 4 లారీలను, 3 ట్రాక్టర్లను, 1 ప్రొక్లెయిన్‌  సీజ్‌ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.