ఇంద్రకీలాద్రిపై ముగిసిన శాకంబరి ఉత్సవాలు- 40 టన్నుల కాయగూరలు, పండ్లతో ఆలయ అలంకరణ - Sakambari utsavalu - SAKAMBARI UTSAVALU

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 9:36 AM IST

Sakambari utsavalu end on Indrakiladri in Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సుమారు 40 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారి ఆలయం, ఉపాలయాన్ని అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తంగా పూర్ణాహుతిని ఆలయ ఈవో రామరావు దంపతులు నిర్వహించారు. భక్తులకు కదంబం ప్రసాదంగా పంచారు. తర్వాత కామధేను అమ్మవారి ఆలయం ఘాట్‌ నుంచి గిరి ప్రదక్షిణ చేశారు. మరోవైపు విశాఖ కనకమహలక్ష్మి దేవస్థానం నుంచి అమ్మవారికి పవిత్రసారె సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని ఆలయ ఈవో రామరావు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఘాట్​ రోడ్డు మూసివేశామని తెలిపారు. అయినా భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అమ్మవారి ఉత్సవాలకు సహకరించిన దాతలు, పండితులు, ఆలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.