పొత్తుల కోసం వెంపర్లాడటం చూస్తే టీడీపీ బలహీనత బయటపడుతోంది: సజ్జల రామకృష్ణారెడ్డి
🎬 Watch Now: Feature Video
Sajjala Ramakrishna Reddy Comments Chandrababu: తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం బీజేపీ తన స్థాయిని బీజేపీ దిగజార్చుకుంటోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. ఇంత బతుకు బతికిన భారతీయ జనతా పార్టీకి ఇదంతా అవమానంగా అనిపిస్తుందన్నారు. బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నేతలను కలవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును బీజేపీ నేతలే పిలిచారని ప్రచారం చేసుకుంటున్నారని, చంద్రబాబు తప్ప మరో అవకాశం లేదన్నట్లు బీజేపీ నేతలు అనుకుంటున్నారన్నారు. పొత్తుల గురించి వెంపర్లాడటం చూస్తే టీడీపీ ఎంత బలహీనంగా ఉందనేది బయటపడుతోందన్నారు.
టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు స్క్రిప్టునే షర్మిల చదువుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏమనాలనుకుంటున్నారో అవే మాటలు షర్మిల నోట వస్తున్నాయని అన్నారు. టీడీపీ నేతలకు సమాధానం చెబితే షర్మిలకు చెప్పినట్లేనన్నారు. అదే విధంగా సీఎం జగన్ దిల్లీ పర్యటనపై సైతం సజ్జల స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు అమిత్ షాను కలిశారని, సీఎం హోదాలోనే వైఎస్ జగన్ ప్రధానిని కలవబోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైనే ప్రధానితో సీఎం జగన్ చర్చిస్తారన్నారు. రాజ్యసభ రేసులో టీడీపీ అభ్యర్థిని నిలిపినా గెలిపించే బలం లేదని, అభ్యర్థిని నిలపాలని టీడీపీ ఆలోచన చేయడమే అనైతికమన్నారు.