పింఛను డబ్బులు చోరీ చేశారని డ్రామా - సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్‌ - Sachivalayam employee Suspended - SACHIVALAYAM EMPLOYEE SUSPENDED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:38 PM IST

SACHIVALAYAM EMPLOYEE SUSPENDED: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో సచివాలయం మౌలిక సదుపాయాల కార్యదర్శి మురళీమోహన్​పై సస్పెన్షన్ వేటుపడింది. మురళీమోహన్​ను సస్పెండ్ చేస్తూ పురపాలక కమిషనర్ రఘునాథ్​రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బును సొంతానికి ఉపయోగించుకున్న మురళీమోహన్, ఆ డబ్బులు దుండగులు అపహరించారంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. స్పృహ తప్పి కింద పడి ఆసుపత్రిలో చేరానంటూ కట్టుకథ అల్లారు.

ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయడానికి వెళుతుండగా స్పృహ తప్పి బైక్ పైనుంచి కింద పడిపోయానని, ఈ క్రమంలో 4 లక్షల రూపాయల డబ్బును దుండగులు అపహరించారని కార్యదర్శి మురళి చెబుతున్నారు. అతన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా పింఛన్​ డబ్బులు మాయం అవ్వడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.  దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. మురళీమోహన్ ఆన్​లైన్ బెట్టింగ్ ఆడి పెన్షన్ డబ్బులు పోగొట్టినట్లు తేలింది. దీంతో అతన్ని మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పురపాలిక అధికారుల ఫిర్యాదు మేరకు మురళీమోహన్​పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.