thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 11 hours ago

ETV Bharat / Videos

శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రష్యన్ల సందడి - సెల్ఫీలు దిగేందుకు భక్తుల పోటీ - Russian devotees in Srikalahasti

Russian Devotees in Srikalahasti Temple: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహు, కేతు పూజలు చేస్తే సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల అపార నమ్మకం. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ భక్తులు సందడి చేశారు. సుమాపు 30 మందికి పైగా రష్యన్ భక్తులు స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

హిందూ సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలో నిర్వహించే పూజల్లో పాల్గొన్నారు. శివనామ స్మరణలతో శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని రష్యన్ భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయంలోని పరిహార దేవతామూర్తులతో పాటు పరిసర ప్రాంతాలు, ఆలయ గోడలపై శిల్పాలను ఆసక్తిగా వీక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలలోని వివిధ రకాల చిత్రాలను సెల్ ఫోన్లలో బందిస్తూ సందడి చేశారు. రష్యా భక్తులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.