హైదరాబాద్‌లో ఉత్సాహంగా 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' - జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ తమిళిసై - హైదరాబాద్‌లో రన్ ఫర్ గర్ల్ చైల్డ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 11, 2024, 12:26 PM IST
Run For Girl Child In Hyderabad : బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉత్సాహంగా కొనసాగింది. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. బాలికల సాధికారత కోసం అవగాహన కల్పించడం కోసం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన రన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు 5 కిలో మీటర్లు కొనసాగింది. అక్కడి నుంచి సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా 10, 21 కిలో మీటర్ల రన్ పూర్తి చేశారు.
ఇందులో ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను తమిళిసై అభినందించారు. ప్రస్తుతం 300 కిషోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లో సుమారు 6700 మంది లబ్ధిదారులతో చురుకుగా పని చేస్తున్నాయని, ఈ రన్ ద్వారా మరో 500 కేంద్రాలను విస్తరిస్తూ పది వేల లబ్ది దారులకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.