కడప జిల్లాలో రాజకీయ హింసపై ఆందోళన వెలిబుచ్చిన అఖిలపక్ష నేతల రౌండ్ టేబుల్ సమావేశం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 9:39 PM IST

Round Table Meeting of All Party Leaders in Kadapa District : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే వివిధ పార్టీ నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు-ఘర్షణలకు దిగుతున్నారు. ఇటీవల కడపలో చోటుచేసుకున్న వివిద ఘటనలపై విపక్షనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో రెచ్చగొట్టే ధోరణి, భయపెట్టడం, హింసకు దిగడాన్ని అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనిపై కడప ప్రెస్ క్లబ్​లో  రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఏ జిల్లాలో గొడవలు జరిగిన కడప జిల్లాలో మాత్రం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవని నాయకులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు మెుదలు కాకుండనే కడప జిల్లాలో ఘర్షణలు మెుదలయ్యాయని తెలిపారు.

జిల్లాలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంత ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించుకోవాలని నేతలు కోరారు. నాలుగు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి అంజాద్​భాషా సోదరుడు టీడీపీ కార్యకర్తని దూషిస్తూ చేయు చేసుకోవటం సరికాదని తెలిపారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి గొడవలు జరగకుండా జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ కౌశల్ ప్రత్యేక దృష్టి సారించాలని అఖిలపక్ష నేతలు కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.