వివాహ వేడుకలో భారీ చోరీ - 29 తులాల బంగారం అపహరణ - Robbery at Function Hall in Gadwal
🎬 Watch Now: Feature Video


Published : Mar 13, 2024, 4:36 PM IST
Robbery at Marriage Event in Gadwal : జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్.వి. ఈవెంట్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో భారీ చోరీ జరిగింది. వివాహ వేడుకల అనంతరం వధూవరులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 29 తులాల బంగారం అపహరించినట్లు బాధితుడు కృష్ణ వర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12న రాత్రి ఈవెంట్ హాల్లో ఫంక్షన్ ముగిశాక ఆభరణాలు ఓ గదిలో తీసి పెట్టి పడుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి బంగారం కనపడకపోవడంతో దొంగతనం జరిగినట్టు బాధితులు గుర్తించారు.
దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు. కాగా ఫంక్షన్ హాల్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో పోలీసులు పరిశీలించారు. దొంగతనం తెలిసిన వ్యక్తులు చేశారా లేదా బయట వ్యక్తులు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.