సంగారెడ్డిలో దోపిడీ దొంగల బీభత్సం - ఏకకాలంలో 3 వైన్సులు, రెండు కిరాణా స్టోర్లు, 10 వస్త్ర దుకాణాల్లో చోరీ - Clothing Stores Theft In Sangareddy
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 2:02 PM IST
Robberies Clothing Stores In Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున పట్టణంలోని సుభాష్ గంజ్, మొమిన్ మోహల్లా, ఓల్డ్ ఆర్టీఏ చెక్ పోస్ట్, బస్తాపూర్ కమాన్లోని మద్యం, వస్త్ర దుకాణాల్లో చోరీలు చేశారు. మూడు మద్యం దుకాణాలు, రెండు కిరాణా జనరల్ స్టోర్లు, పదికి పైగా వస్త్ర దుకాణాల్లో తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో ఏకకాలంలో దోపిడీకి పాల్పడి భారీగా నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. ఇనుప రాడ్లు ఉపయోగించి తాళాలు పగులగొట్టి, నిమిషాల వ్యవధిలో సొత్తును దోచుకెళ్లారు.
Theft In Sangareddy : మద్యం దుకాణాల్లో ఖరీదైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు దుకాణదారులు తెలిపారు. చోరీకి వచ్చిన వ్యక్తులు నిర్భయంగా ముఖానికి మాస్కులు సైతం లేకుండా ఉద్యోగుల మాదిరి బ్యాగులు వేసుకుని వీధుల్లో తిరుగుతూ దుకాణాలను టార్గెట్ చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా, చోరీలు జరగడం చర్చనీయంశంగా మారింది.