అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా- ఒకరు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు - Road Accident - ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 8:33 PM IST
Road Accident in Vizianagaram District : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంగర మండలం పట్టువర్దనం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సత్తమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 సహాయంతో క్షతగాత్రులను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
One Person Died, 15 People Injured : పట్టువర్దనం గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ప్రమాదంలో గాయపడిన వారు తెర్లాం, బలిజిపేట మండల్లోని కాలంరాజుపేట, నందబలగ, పెదపెంకి గ్రామ వాసులని పోలీసులు గుర్తించారు. ఈ మండల వాసులు సుమారు 20 మంది వంగర మండలం పట్టువర్దనం గ్రామానికి శుభకార్యాన్ని వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.