సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - కారు ఢీకొని సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి - Road Accident In Sangareddy - ROAD ACCIDENT IN SANGAREDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-08-2024/640-480-22346108-thumbnail-16x9-car.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 31, 2024, 10:05 PM IST
Road Accident In Sangareddy Dist : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోపన్‌పల్లి చౌరస్తా వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు వేగంగా ఢీకొట్టింది. కారు వేగం ధాటికి సత్వార్ గ్రామానికి చెందిన పెంటప్ప గాల్లోకి ఎగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద ఘటన సీసీటీవీలో నమోదైంది. 65వ నెంబర్ జాతీయ రహదారికి అవతల ఉన్న పొలాలకు సైకిల్‌పై వెళ్తుండగా ముంబయి వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టగా పెంటప్ప ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డాడు.
వృద్ధుడిని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఎవరూ లేరని పారిపోయేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకుని చిరాగ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఘటనా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైయ్యాయి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు గాళ్లో కలిసిపోతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పోలీసులు కోరుతున్నప్పటికీ వినకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. మరికొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.