ట్రాక్టర్​ ట్రాలీని ఢీకొట్టిన బైక్​ - అతి వేగానికి ఇద్దరు బలి - ROAD ACCIDENT IN CHITTOOR - ROAD ACCIDENT IN CHITTOOR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 9:55 AM IST

Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్​ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పాలిటెక్నిక్ విద్యార్థులు మరణించారు. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం కుప్పం పట్టణం చెరువు కట్ట సమీపంలోని కూడలి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆనందబాబు (17), మంజు (17) చనిపోగా, పునీత్​ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు కుప్పం ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో చదువుతున్నారు. 

వీరు ముగ్గురు కలిసి పలమనేరు వైపు వెళ్లి కుప్పంకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని చెరువు కట్టకూడలి వద్దకు రాగానే వేగాన్ని నియంత్రించలేక కూడలి రోడ్డు దాటుతున్న ట్రాక్టర్​ను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఆనందబాబు అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మంజు అనే వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పునీత్​ తీవ్ర గాయాలతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.