గంగవరం పోర్ట్ వాటాదారులకు స్టీల్ ​ప్లాంట్ సీఎండీ అభినందనలు - RINL CMD Atul Bhat - RINL CMD ATUL BHAT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 10:44 PM IST

RINL CMD Atul Bhat Thanked Stakeholders of Gangavaram Port: అదానీ గంగవరం పోర్ట్ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి అత్యవసరమైన ముడిసరుకు రవాణా సమస్యను పరిష్కారానికి కృషిచేసిన వాటాదారులకు ఆర్​ఐఎన్​ఎల్(RINL) సీఎండీ అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు. 12 ఏప్రిల్ 2024 నుంచి అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ కార్మికులు ఆందోళనకు దిగడంతో ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో విశాఖ ఉక్కు కర్మాగార ఉత్పత్తి ప్రక్రియలకు కీలకమైన ముడి పదార్థాలు, బొగ్గు, సున్నపురాయిని సేకరించే ఆర్​ఐఎన్​ఎల్ సామర్థ్యంపై గణనీయంగా ప్రభావితం చూపింది ఆర్​ఐఎన్​ఎల్​కు అవసరమైన ముడిసరుకు రవాణా సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన వాటాదారులందరికీ అతుల్ భట్‌ అభినందనలు తెలిపారు.

అతుల్ భట్ తన సందేశంలో, జిల్లా పరిపాలన విభాగం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చుట్టూ నివసిస్తున్న సోదరులు మరియు సోదరీమణులకు, ఆర్​ఐఎన్​ఎల్ ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్ సభ్యులు, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్, ప్రజాప్రతినిధులు, నివాసితులతో సహా కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర వాటాదారులకు మరియు నిర్వాసితులైన వ్యక్తులు ఈ తీవ్రమైన ముడిసరుకు సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆర్​ఐఎన్​ఎల్​తో కలిసి పని చేయడంలో సకాలంలో జోక్యం చేసుకున్నందుకు అతుల్ భట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.