విశాఖ ఉక్కు స్థలాలను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం - ఈ నెల 15లోగా బిడ్లు దాఖలు చేయాలని ప్రకటన - Visakha Steel Plant Buildings LEASE - VISAKHA STEEL PLANT BUILDINGS LEASE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 12:37 PM IST
Visakha Steel Plant Lands Lease : విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయడకూడదని ఉద్యోగస్తులు నిర్విరామంగా నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అలాగే హైకోర్టులో సైతం ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా షిటీషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఓ అడుగు ముందుకు వేసింది.
Vizag Steel Plant Privatisation : విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన ఉక్కు హౌస్, గంగవరం గెస్ట్‌హౌస్‌లను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నగరంలో రూ.1,600 కోట్ల విలువైన సుమారు 25 ఎకరాల ఉక్కు స్థలాల్ని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహణ ఆదాయం నిమిత్తం ఉక్కు గెస్ట్‌హౌస్‌లను 30 ఏళ్ల పాటు దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన కట్టబెట్టేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) అడుగులు వేసింది. 116 అతిథి గృహాలు, విశాలమైన హాల్స్, రెస్టారెంట్ కలిగిన ఉక్కు హౌస్‌ను, 5 గదుల గంగవరం గెస్ట్‌హౌస్‌ను ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకునేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 15లోగా బిడ్లు దాఖలు చేయాలని లేఖలో పేర్కొంది. విదేశీ నిపుణులు ఉండేందుకు అనువుగా త్రీస్టార్ సౌకర్యాలతో ఉక్కు హౌస్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని నిర్వహణ ఆర్‌ఐఎన్‌ఎల్ చూస్తోంది. గంగవరం గెస్ట్‌హౌస్ మూతపడి ఉంది. దీన్ని తెరిపించి ప్రైవేటుకు ఇచ్చి ఆదాయం పొందాలని చూస్తున్నారు.