ఈ నెల 20న సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం - review meeting on Giri Pradakshina - REVIEW MEETING ON GIRI PRADAKSHINA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 10:34 PM IST
Review Meeting on Simhachalam Appanna Giri Pradakshina : సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జులై 20, 21 తేదీల్లో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. మొత్తం 32 కి.మీ మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయనున్నారు. ఇందుకోసం అధికారులతో కలిసి ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులకు మధురానుభూతిని కలిగించేలా ఈసారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మాధవథార దగ్గర స్నానాలు ఆచరించే ప్రాంతంలో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. గిరి ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, జీవీఎంసీ అడిషనల్ కమీషనర్, ఇతర అధికారులు 32 కిలోమీటర్లను బస్సులో స్వయంగా పర్వవేక్షించటం శుభపరిణామమన్నారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాడంలో అధికారులదే కీలక పాత్రని ఎమ్మెల్యే గంటాా తెలిపారు.
అయితే ఏటా జులై నెలలో ఈ గిరి ప్రదక్షిణ చేయటం ఆనవాయితీగా వస్తుంది. సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకగా వెళ్తారు. ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు.