అక్రమ నిర్మాణాల కూల్చివేత - పీర్జాదిగూడలో ఉద్రిక్తత
🎬 Watch Now: Feature Video
Revenue Officer Demolishes Illegal Houses in Hyderabad : హైదరాబాద్ శివారు పీర్జాదిగూడ నగర పాలక సంస్థలో ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు వరకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా పోలీసులు శాంతింపజేశారు. గత ప్రభుత్వ హయాంలోని ఓ ప్రజాప్రతినిధి సాయంతో సాయిప్రియా నగర్ సర్వే నెంబరు 10, 11 లలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ స్థలాన్ని ఇంటి స్థలాలుగా మార్చారు.
Demolished Illegal Houses in Peerzadiguda : అందులో చిన్న గదిని నిర్మించి నగర పాలక సంస్థ నుంచి ఇంటి నెంబరు ఇప్పించారు. దీంతో కొనుగోలు దారుల్లో నమ్మకం కలిగించి 60 నుంచి 100 గజాల స్థలాన్ని 20 లక్షల చొప్పున విక్రయించారు. ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్నారని గతంలో రాజకీయ పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములను విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.