LIVE : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు - Republic Day Celebrations telangana
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20595314-thumbnail-16x9-republic--day--celebrations.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 26, 2024, 7:36 AM IST
|Updated : Jan 26, 2024, 7:50 AM IST
Republic Day Celebrations Live : రాష్ట్రవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, అన్ని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. లాకికత్వం, సమానత్వమే రాజ్యంగం ముఖ్య ఉద్దేశమని నేతలు తెలిపారు. దేశ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకల దృష్ట్యా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం కొద్దిసేపు , రాజ్‌భవన్ పరిసరాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.