సహాయక చర్యలు ముమ్మరం - బాధితులకు ఆహారం పంపిణీ - Food Packing For Flood Victims
🎬 Watch Now: Feature Video
Relief Operations for Flood Victims are Going Fast: వరద బాధితులకు సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వర్షం కారణంగా కొంతసేపు సహాయక చర్యలకు ఆటంకం కలిగినా తర్వాత కొనసాగింది. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి పాలు, కాయలు ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే లక్షకు పైగా ఆహార ప్యాకెట్లు తయారు చేశామని అధికారులు చెప్తున్నారు. భారీ ఎత్తున మెప్మా మహిళా సిబ్బంది ప్యాకింగ్‌లో పాల్గొన్నారు. ఆపిల్, బత్తాయి, బ్రెడ్, మంచినీళ్లు, నూడిల్స్, బిస్కట్లను ప్యాకింగ్ చేస్తున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు: సీఎం చంద్రబాబు నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, లీటర్ పామాయిల్, రెండు కిలోల ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అందిస్తున్నారు. వరదలు తగ్గిన ప్రాంతాల్లో ఇవి పంచే ఏర్పాట్లు చేశారు. ఇంకా ముంపులో ఉన్న ప్రాంతాల్లో ఆహారం, పండ్లు భోజనం సరఫరా చేస్తున్నారు.