వైఎస్సార్సీపీకు మరోషాక్‌ - మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజీనామా! - RAPAKA RESIGNED TO YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2024, 10:24 PM IST

Razole EX MLA Rapaka Vara Prasada Rao Resigned to YCP Party : వైఎస్సార్సీపీకు మరోషాక్‌ తగిలింది. కోనసీమ జిల్లా రాజోలు మాజీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మలికిపురంలో ఎమ్మెల్యే దేవర ప్రసాద్‌ను కలిసిన ఆయన వైఎస్సార్సీపీ తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావును అధిష్టానం నియమించిందని ఆయనతో కలిసి పనిచేయడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన తనను వైఎస్సార్సీపీ అవమానించిందని తెలిపారు. రాజోలు నియోజకవర్గంలో ఎంత కష్టపడి పనిచేసినా, తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోయినా, ఓడిపోతానని తెలిసినా పెద్దల సలహా మేరకు అమలాపురం ఎంపీగా పోటీ చేశానని వెల్లడించారు.

అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజోలులో పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే జనసేన తరుఫున గెలిచిన ఆయన, అప్పటి అధికార వైఎస్సార్సీపీతో సన్నిహితంగా మెలిగారు. తరువాత మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాపాక, ప్రస్తుతం మళ్లీ కూటమి వైపు చూస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.