ఐదేళ్లలో ఐదు పార్టీలు మారిన మాజీ మంత్రి రావెల - వైఎస్సార్సీపీలో చేరిక - మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 3:12 PM IST
Ravela Kishore Babu Joined in YSRCP: మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఐదేళ్లలో ఐదు పార్టీలు మారారు. బుధవారం ఆయన జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న రావెల కిషోర్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా పని చేశారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిని కోల్పోయారు. 2018 నవంబర్ 30న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అదే ఏడాది డిసెంబర్‌లో జనసేన పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 2019 జూన్‌లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడ రెండున్నరేళ్ల పాటు ఉన్నారు.
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాతో 2022 మే 16న రావెల కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2023 జనవరి 3వ తేదీన కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్‌తో పాటు ఒకట్రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరారు. రావెలకు బాపట్ల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2018 నవంబర్ 30న తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి లెక్కిస్తే ఇప్పటికి ఐదేళ్లలో ఐదు పార్టీలు మారి కొత్త రికార్డు సృష్టించారు.