గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఈనాడు లక్ష్య కృషి చేస్తోంది : పుల్లెల గోపీచంద్ - Ramoji Memorial Athletics in hyd - RAMOJI MEMORIAL ATHLETICS IN HYD
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 7:52 PM IST
Ramoji Memorial Athletics Competitions In Hyderabad : గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ ప్రాజెక్టు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ కృషి చేస్తోందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేసిన చెరుకూరి రామోజీరావు మెమోరియల్ తెలంగాణ రాష్ట్ర కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌ను నిర్వహించారు. పుల్లెల గోపీచంద్ ఈ పోటీలను ప్రారంభించారు.
ఈనాడు లక్ష్య అథ్లెటిక్స్ ప్రాజెక్టు సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో 50 చోట్ల గ్రామీణ విద్యార్థులకు గత ఐదేళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు ఛాంపియన్‌షిప్ పోటీల్లో అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామోజీరావుకు మెమోరియల్‌గా 8, 10, 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వాళ్లకు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి స్థానంలో నిలిచిన వాళ్లకు రూ.2 వేలు, రెండో స్థానంలో నిలిచిన వాళ్లకు రూ.1000, మూడో స్థానంలో నిలిచిన వాళ్లకు రూ.500ల నగదును అందించారు.