'అక్షరయోధుడు రామోజీ' - కళ్యాణదుర్గంలో రామోజీరావు సంస్మరణ సభ - RAMOJI RAO MEMORIAL MEETING - RAMOJI RAO MEMORIAL MEETING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-07-2024/640-480-21944080-thumbnail-16x9-ramoji-rao-memorial-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 13, 2024, 9:22 PM IST
RAMOJI RAO MEMORIAL MEETING: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎస్వీ ఫంక్షన్‌హాల్‌లో స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు రాధేయ, మల్లికార్జున, కన్నడ పత్రిక శ్రీశైలప్రభ సంపాదకులు బలరామాచర్య తదితురుల రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈనాడు, ఈటీవీ ద్వారా సమాజానికి సేవ చేసిన అక్షర యోధుడు రామోజీ అని కొనియాడారు. స్ఫూర్తిదాయకమైన దార్శనికుడు, మహనీయుడు రామోజీరావు అని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. ఆయనకు ఆయనే సాటిగా ఎదిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాగాయకుడు లెనిన్ పాటల ద్వారా రామోజీరావు గొప్పతనాన్ని తెలియపరిచారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల ద్వారా రామోజీరావు చేసిన సామాజిక సేవలను గుర్తు చేసుకున్నారు.