సకల జనుల సమరభేరి ర్యాలీ- ఏకమైన అఖిలపక్ష పార్టీలు - మదనపల్లిలో సకల జనుల సమరభేరి ర్యాలీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 5:51 PM IST

Rally in Madanapally To Made it As District Andhra Pradesh : మదనపల్లిలో సకల జనుల సమరభేరి ర్యాలీ (Rally) జోరుగా సాగింది. ర్యాలీకి అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. మదన పల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బహుజన సేన ఆధ్వర్యంలో సకలజనుల సమరభేరి ర్యాలీ నిర్వహించారు. దీనిలో అఖిలపక్ష పార్టీలు ఏకమై పాల్గొన్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), సీపీఐ (CPI) , సీపీఎం (CPM) ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలు పాల్గొన్నారు. 

TDP, Janasena, CPI, CPM Protest in Annamayya District : పురవీధుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రాంత ప్రజల ఆకాంక్షను, డిమాండ్లను చాటి చెప్పారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసే పార్టీలకు వారి పూర్తి మద్దతు ఉంటుందని నిరసనకారులు, ప్రజలు స్పష్టం చేశారు.మదనపల్లిని జిల్లా కేంద్రంగా చెయ్యాలని, లేకపోతే వారంతా ఏకమై సమాధానం చెప్తామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.