అసంపూర్తి భవనాలు - హడావుడిగా ప్రారంభించిన మంత్రి బుగ్గన - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 12:49 PM IST
Rajendranath Reddy Incomplete Works Suddenly Opened in Dhone: నంద్యాల జిల్లా డోన్‌లో పూర్తికాని పలు అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హడావిడిగా ప్రారంభోత్సవాలు చేశారు. 120 కోట్ల రూపాయలతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి, పాత బస్టాండ్‌లోని కూరగాయల మార్కెట్, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, వసతి గృహాలను మంత్రి బుగ్గన ఆగమేఘాలపై ప్రారంభించారు. వంద పడకల ఆసుపత్రి వెనుక భాగంలో చేయాల్సిన పనులు, కూరగాయల మార్కెట్, బాలికల వసతి గృహంలో 50శాతం పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
పట్టణంలోని రుద్రాక్ష గుట్ట వద్ద రూ.36 కోట్లతో బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మొదటి దశగా రూ.20 కోట్లతో పాఠశాల పనులు మొదలుపెట్టి కొన్ని తరగతి, ల్యాబ్ గదులు నిర్మించారు. ఇంకా 30 శాతం వరకు పనులు పూర్తి చేయాల్సి ఉన్నా మంత్రి బుగ్గన ఆదివారం హడావిడిగా ప్రారంభించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాలికల వసతి గృహాం వద్ద కూలీలు పని చేస్తుండటం చూసి ప్రజలు విస్తూ పోయారు. సగం పూర్తైన వాటికి మాత్రమే రంగులు వేసి అసంపూర్తిగా ఉన్న భవనాలను వదిలేసి మంత్రి ప్రారంభించటం ఏంటని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.