కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ - తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు - Railway track washed in Kesamudram - RAILWAY TRACK WASHED IN KESAMUDRAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/640-480-22351786-thumbnail-16x9-train.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 1, 2024, 8:35 PM IST
Railway Track Washed Away in Mahabubabad Kesamudram : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కేసముద్రం-ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. కేసముద్రం రైల్వేస్టేషన్లో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికులకు పోలీసులు అల్పాహారం, నీరు అందించారు. ఈ రైల్వే ట్రాక్ పూర్తిస్థాయిలో దెబ్బతింది. రైల్వే ట్రాక్ కింద ఉండే కంకర మొత్తం వరదకు కొట్టుకుపోయింది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు 24 రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. రైల్వే అధికారులు కేసముద్రం-ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నారు.
రైల్వేకు సంబంధించిన ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌లు తెగిపోవడం రైళ్లు నిలిపివేశారు. ఇవాళ, రేపు 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్-విజయవాడ రూట్లోనే అత్యధిక రైళ్లు రద్దు అయ్యాయి. పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.