వైఎస్ షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో కామెంట్స్ - స్పందించిన రాహుల్ గాంధీ - congress party
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-02-2024/640-480-20662557-thumbnail-16x9-rahul-gandhi-tweet-on-ys-sharmila.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 10:50 AM IST
Rahul Gandhi Tweet on YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యాఖ్యలను ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య అని అన్నారు. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని పోస్టు చేశారు.
కాగా సామాజిక మాధ్యమాలలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ ఇటీవల వైఎస్ సునీత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనతోపాటు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలపై అసభ్య పదజాలంతో ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్నారని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత హేయమైన పదాలతో దూషిస్తున్నారని, వైఎస్ విజయమ్మపై మరింత దారుణమైన పదాలు వినియోగించారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లికి సునీత ఫిర్యాదు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల, సునీతపై వస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.