జగన్ తిష్ఠవేసినా పిఠాపురంలో పవన్‌కు 65వేల ఓట్ల మెజారిటీ ఖాయం: ఎంపీ రఘురామ - MP Raghu Rama Meet Pawan Kalyan - MP RAGHU RAMA MEET PAWAN KALYAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:50 PM IST
MP Raghu Rama Meet Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఉగాది వేడుకలకు విచ్చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్ వచ్చి తిష్టవేసినా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ 65 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌పై కేసులకు సంబంధించిన కీలక పత్రాలను ఏపీ సీఐడీ కార్యాలయం వెనక కాల్చడం చూశామన్నారు. దానికి సిట్ అధిపతి రఘురామ్ రెడ్డి జిరాక్స్ మిషన్ వేడెక్కడం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయని, ప్రింట్లు సరిగ్గాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
హెరిటేజ్‌కు సంబంధించిన పేపర్లు మాత్రమే అలా జరగడం వేనుక అంతర్యమేంటని పోలీసులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో 'ఈ పాపులకు శిక్షలు తప్పవు' అని రఘురామ హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక శక్తులను, వైసీపీ పాలనను అంతం చేసేందుకు కూటమిగా జట్టుకట్టాలని మొదటి నుంచి పవన్ పరితపించారని వెల్లడించారు. పవిత్రమైన ఉగాది రోజున పవన్ కలవడం పట్ల రఘురామ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయని కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.