LIVE : ఉప్పల్ స్టేడియంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రెస్ మీట్ - Rachakonda CP Sudhir Babu live
🎬 Watch Now: Feature Video
Published : Jan 24, 2024, 1:14 PM IST
Rachakonda CP Sudhir Babu Live: ఉప్పల్ స్టేడియంలో రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి ఇరు జట్లు చేరుకున్నాయి. రెండు రోజులుగా ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రాక్టీసు చేస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషణ్ ఉప్పల్ స్టేడియాన్నిఅధునాతన సౌకర్యాలతో ముస్తాబు చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం నుంచి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. టెస్టు సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని రోహిత్ శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ గెలుస్తామని భావిస్తున్నామని అన్నారు. ఇంగ్లండ్‌లో మంచి పోటీ ఇచ్చే ఆటగాళ్లు ఉన్నారన్న రోహిత్, రెండు నెలలుగా మా ఆటగాళ్లు స్థిరమైన ప్రదర్శన చేస్తున్నారని వెల్లడించారు.ఈ టెస్టు మ్యాచ్‌లో ఆడటం ఛాలెంజ్‌గా ఉంటుందని కానీ ఉప్పల్ మైదానంలో ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతామని రోహిత్ చెప్పుకొచ్చారు. తాజాగా మ్యాచ్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.