thumbnail

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కొండచిలువ కలకలం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Python at Cm Chandrababu House Undavalli : ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. ఏదో జంతువును మింగిన కొండచిలువను సీఎం ఇంటి సమీపాన ఉన్న మీడియా పాయింట్‌ వద్ద గుర్తించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన సీఎం భద్రతా సిబ్బంది మునిసిపాలిటీ వారికి సమాచారం ఇచ్చారు. వారు చనిపోయిన కొండచిలువను అక్కడి నుంచి తొలగించే ఏర్పాటు చేశారు. 

ఇటీవల మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి కొండ చిలువ ఎక్కింది. అయినా అతడిలో భయం, బెరుకూ కాదు కదా తనపై కొండచిలువ ఉందనే విషయమే సోయి లేకుండా కూర్చున్నాడు. తాగిన మైకంలో చలనం లేకుండా మత్తులోనే తూలుతున్నాడు. మందుబాబుపై ఎక్కిన కొండ చిలువను పసిగట్టిన స్థానికులు కర్రల సహాయంతో దాన్ని తొలగించారు. దీంతో కొండ చిలువ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు మందుబాబు. ఇదే కాకుండా జనావాసాల్లోకి కొండచిలువలు వచ్చిన ఘటనలు కోకొల్లులు. అంతేకాకుండా తాజాగా పల్నాడు జిల్లాలో బైపాస్‌ రోడ్డుపై మొసలి కలకలం రేపిన సంగితి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.