'యూపీఏ ప్రభుత్వం ఏనాడు పీవీ నరసింహరావు పేరెత్తలేదు' - pv narasimharao
🎬 Watch Now: Feature Video
Published : Feb 9, 2024, 9:53 PM IST
PV Narasimha Rao Grand Son Fires on Congress : పీవీ నరసింహారావు కాంగ్రెస్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనకు ఆ పార్టీలో గౌరవం లేదని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ తెలిపారు. పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ బీజేపీ ఆయనకు భారతరత్న(Bharat Ratna) ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పుడు పీవీ నరసింహారావు ఊసే ఎత్తలేదని, ఎలాంటి అవార్డులు ప్రకటించలేదని మండిపడ్డారు. మంచి జరిగితే కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం తీసుకుంది, వైఫల్యాలను పీవీ నరసింహారావు మీద వేసేవారని ఆవేదన చెందారు.
PV Narasimha Rao Grand Son Comments on Gandhi Family : ఆయనకు భారతరత్న రాకుండా, విషం చిమ్మే విధంగా గాంధీ కుటుంబం చాలా చాలా కీలకపాత్ర పోషించిందని విమర్శించారు. ఇది పీవీ(PV Narasimha Rao) కుటుంబానికి దక్కిన గౌరవమని నరేంద్ర మోదీ జాతీయ నాయకుడిగా, యావత్ ప్రపంచానికి నాయకుడిలా మారిన కీలక తరుణంగా ఇలా భారతరత్న ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఆలస్యమైనా చాలా ఏళ్లుగా ఎదురు చూశామన్నారు. కానీ తెలంగాణ బీజేపీ ప్రయత్నాల వల్లే ఈ రోజు పీవీకి భారత అత్యుత్తమ పురస్కారం లభించిందని ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పీవీ నరసింహారావు మనవడు చెప్పారు. తాము కన్న కల, గొప్ప విజయం నెరవేరిందని ఎమోషనల్ అయ్యారు.