బాల రాముడి ప్రతిష్ఠాపనతో శతాబ్ధాల కల సాకారమైంది : పురందేశ్వరి - మల్లికార్జునస్వామిఆలయంలోపురందేశ్వరి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 5:01 PM IST
Purandeshwari Visit Srisailam: ఎన్నో శతాబ్దాల ఆందోళన ఫలితంగా నేడు అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠ కల సాకారమైందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP state president Daggubati Purandeshwari) ఆనందం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని పురందేశ్వరి ఈరోజు దర్శించుకున్నారు. శ్రీరాముడు, మల్లికార్జున స్వామి దీవెనలు తెలుగు రాష్ట్రాల ప్రజలపై ఉండాలని ప్రార్ధించానని ఆమె తెలిపారు.
Temple Priests Grand Welcome to Purandeshwari: స్వామి వారి దర్శనానికి వచ్చిన పురందేశ్వరికి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పూజలు పురందేశ్వరి నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పురందేశ్వరికి ఆశీర్వచనాలు అందించి, దేవస్థానం తరపున అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. పురందేశ్వరి వెంట బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, నాయకులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.