జగనన్న లే అవుట్లతోనే తమకు సమస్యలు- నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్​సెల్​కు బాధితులు - Public Problem Solving Program - PUBLIC PROBLEM SOLVING PROGRAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 8:27 PM IST

Public Problem Solving Program in Nellore Collectorate: నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు వినతులు ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ కోరారు. తమ స్థలంలో జగనన్న లేఅవుట్లు వేసి ఇళ్లు నిర్మించారని కందుకూరుకు చెందిన కుటుంబ ఫిర్యాదు చేసింది. నెల్లూరు 1వ డివిజన్ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చర్యలు తీసుకోవాలని గుండ్లపాలెంకు చెందిన మల్లిసింహగిరి కోరారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ విచారణ పేరుతో కొన్ని పరిశ్రమలను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ పరిశ్రమలు 50కిపైగా మూతపడ్డాయని పదివేల మంది కార్మికులకు పనులు లేవని తెలిపారు. సైదాపురంలో అక్రమ మైనింగ్​పై విచారణ చేయాలని కోరారు. పౌడర్ ఫ్యాక్టరీలు రెండు నెలలుగా మూతపడి తీవ్రనష్ట వచ్చిందని వారు అధికారులకు వివరించారు. పెరిగిన విద్యుత్ ఛార్జిలతో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అధికారులు సర్వేనెంబర్లు పట్టించుకోకుండా ఖాళీ స్థలం కనపడటంతో జగనన్న లేఅవుట్​గా మార్చారని కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.