మా ఎమ్మెల్యే ఏ పని చేయలేదు - ఆత్మీయ సమావేశంలో మహిళల ఆవేదన - ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 12:52 PM IST
Public against on MLA Gopireddy Srinivasa Reddy : పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాకేమీ చేయలేదని 32వవార్డు ప్రజలు ఆరోపించారు. వార్డు ప్రజలతో ఎమ్మెల్యే గోపిరెడ్డి అసమ్మతి నాయకులు బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించగా స్థానికులంతా తమ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పుకుంటున్నాడే తప్ప తమ వార్డుకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డులో కనీసం తాగు నీటి సమస్య కూడా తీర్చలేదని విమర్శించారు. కుట్టు మిషన్ ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ మహిళ తనకు ఎలాంటి సంక్షేమ పథకం అందలేదని వివరించింది. అదేవిధంగా అన్ని విధాలా అవకాశమున్న తనకు కనీసం స్థలం, ఇల్లు కానీ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందరి సమస్యలు విన్న గజ్జెల బ్రహ్మారెడ్డి ఆ వార్డు ప్రజల సమస్యలను పైస్థాయి నాయకులకు చేరవేసి అందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను అందేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు.