LIVE: శ్రీహరికోట - పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం - ప్రత్యక్ష ప్రసారం - PSLV LAUNCHING AT SRIHARIKOTA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2024, 3:42 PM IST
|Updated : Dec 5, 2024, 4:31 PM IST
PSLV Launching At Sriharikota ISRO LIVE : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ XL వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం ఐదు PSLV వేరియంట్స్‌లో ఇది మోస్ట్ పవర్ ఫుల్ రాకెట్. ఈ రాకెట్ సాధారణ PSLV కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సాధారణ PSLV రాకెట్ 4 బూస్టర్లను మాత్రమే ఉండగా, ఇది 6 పెద్ద బూస్టర్లను కలిగి ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ59 నింగిలోకి దూసుకెళ్తోంది. సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు 'పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3' మిషన్‌ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఈ మిషన్‌లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేయనున్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం
Last Updated : Dec 5, 2024, 4:31 PM IST