మంత్రి ఉష శ్రీచరణ్‌కు నిరసన సెగ - పార్టీ మారేందుకు సిద్ధమని కార్యకర్తల హెచ్చరిక - Protest To YSRCP Leaders

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:10 AM IST

Protest To Minister Ushasri Charan From YSRCP Leaders : శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నిరసన సెగ తలిగింది. మంత్రి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర నారాయణ అసమ్మతి వర్గానికి చెందిన అశ్వత్తమ్మ అనే నాయకురాలు ఇంటికి మంత్రి వెళ్లారు. ఈ ఘటనపై స్థానిక సర్పంచ్ లలితమ్మ, గ్రామ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి పక్కన పడేశారు. ఆత్మీయ పలకరింపును బహిష్కరించారు.

వారు కావాలో మేము కావాలో తేల్చుకోండి : అసమ్మతి నాయకులను కలుపుకొని పోతే తాము పార్టీ మారేందుకు అయినా సిద్ధమని స్థానిక కార్యకర్తలు స్పష్టం చేశారు. సర్పంచ్, గ్రామ నాయకులు తిరుగుబాటు చేయడంతో చాలాకూరు పంచాయతీలో మంత్రి ఆత్మీయ పలకరింపు అర్ధాంతరంగా నిలిచిపోయింది. అక్కడి నుంచి మంత్రి ఉష శ్రీ చరణ్ పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లి పంచాయతీలో కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఉదంతాన్ని చిత్రీకరించిన విలేకరి సెల్‌ఫోన్‌ను మంత్రి గన్‌మెన్ లాక్కుని వీడియో డిలీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.