LIVE : వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలు విడుదల - Venkaiah Naidu Books PM Modi - VENKAIAH NAIDU BOOKS PM MODI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 12:28 PM IST
Venkaiah Naidu Books PM Modi : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను విడుదల చేశారు. ప్రధాని మోదీ విడుదల చేసిన పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర 'వెంకయ్య నాయుడు- లైఫ్ ఇన్ సర్వీస్' మొదటిది. రెండోది 'సెలెబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్‌తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం 'మాహానేత- లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు' పేరుతో సంజర్ కిషోర్ రచించారు.