ఆపత్కాలంలో ఆపన్న హస్తం - వరద ప్రాంత గర్భీణులు ఆసుపత్రికి తరలింపు - PREGNANTS SHIFTING TO HOSPITALS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 12:27 PM IST

Pregnants Shifting from Flood Area to Hospitals: ఓ వైపు పెదవాగు ఊళ్లను ముంచెత్తింది. కనుచూపు మేర నీరే. ఇంట్లో ఉండలేని పరిస్థితి. కాలు పెదవాగు గండితో వేలేరుపాడు మండలం చిగురుటాకులా వణికిపోయింది. కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లోని 19 మంది గర్భిణులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరిని ప్రత్యేక వార్డులో చేర్చారు. ఇప్పటికే ప్రసవమైన వారిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. నెలలు నిండిన గర్భిణులకు పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు రక్తం ఎక్కించి ఆరోగ్య పరిస్థితి మెరుగుకు ఎప్పటికప్పుడు సేవలందిస్తున్నారు. 

వరదల్లో నిండు గర్భిణులు చిక్కుకోవడాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి గమనించి చలించారు. గ్రామాల్లో ఎందరు గర్భిణులున్నారో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది సాయంతో ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. సుమారు 129 మంది గర్భిణులున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. 19 మందిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకురాగా ఇద్దరు ప్రసవించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.